విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని వెంకటేశ్వర మెట్ట ప్రాంతానికి చెందిన పర్వీన్ బేగంకు ఎలాంటి అండ లేదు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి ఫోన్ చేసిన ఆమె.. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను సహాయం అర్ధించారు.
వెంటనే స్పందించిన ఆయన.. నిత్యావసర సరకులను ఆమెకు అందజేశారు. గతంలో తన భర్త కంటి చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం పొందారని.. కానీ, గత ఫిబ్రవరిలో తన భర్త రైలు ప్రమాదంలో చనిపోయారని చెప్పారు.