విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం వర్తనాపల్లిలో వరకట్న వేధింపుల వల్ల ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాడేరుకు చెందిన శివరంజని రెండేళ్ల కిందట ప్రేమవివాహాం చేసుకున్నారు. వీరికి ఏడాది కిందట ఓ బాబు జన్మించాడు. కొద్ది రోజులుగా కట్నం తీసుకురావాలని ఆమెకు అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. మూడు రోజుల కింద భర్త ఆమెతో గొడవ పడ్డాడు. వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన ఆమె కిండంగి సమీప బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు ఫిర్యాదు చేసి మృతదేహాన్ని పాడేరు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వేధింపులకు గురి చేసిన వారిపై దిశా చట్టంద్వారా చర్యలు తీసుకోవాలని ..మృతురాలి సోదరుడు విజ్ఞప్తి చేశాడు.
వరకట్న వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్య - పాడేరులో మహిళ ఆత్మహత్య వార్తలు
ప్రేమ వివాహం చేసుకున్న ఓ మహిళ.. వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరు మండలం వర్తనాపల్లిలో జరిగింది.
వరకట్న వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్య