ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్ష విలువైన 'నాడు - నేడు' పనులకు లక్షా 70 వేలు వసూలు... - గవరపాలెంలో తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ప్రధానోపాధ్యాయుడుల వీడియో వైరల్

నాడు నేడు పనుల్లో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. విశాఖ జిల్లా అనకాపల్లిలో తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయుడు మధ్య జరిగిన సంభాషణల వీడియో వైరల్ అయ్యింది.

A video has gone viral regarding the manipulations going on in the  nadu nedu works at gavarapalem
గవరపాలెంలో నాడు నేడు పనులలో అవకతవకల వీడియో వైరల్

By

Published : Jul 24, 2020, 1:21 PM IST

గవరపాలెంలో నాడు నేడు పనులలో అవకతవకల వీడియో వైరల్

విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెంలో తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయుడు మధ్య జరిగిన సంభాషణల వీడియో వైరల్ అయ్యింది. జీవీఎంసీ బాలికల ఉన్నత పాఠశాలలో నాడు నేడు అభివృద్ధి కింద 34 లక్షలతో పనులు చేపడుతున్నారు. దీనిలో మైనర్ పనుల నిమిత్తం14 లక్షలతో తల్లిదండ్రుల కమిటీ సభ్యులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవీఎంసీ జోనల్ ఏఈ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. సీలింగ్ ప్లాస్టింగ్​కి సంబంధించి రూ.లక్షతో పని జరగాల్సిఉంది. ఆ పనికిరూ.1.70 లక్షలు కేటాయించాలని నాడు నేడు కమిటీ, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు పట్టు పట్టడం.. దీనికి ప్రధానోపాధ్యాయుడు వత్తాసు పలికిన సంభాషణలు వీడియోలో రికార్డయ్యాయి. వీరిని చూస్తుంటే...పనుల్లో ఎంత అవినీతి జరుగుతుందో అర్థమవుతుందని పలువురు అంటున్నారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏవీ బ్రహ్మానందాన్ని వివరణ కోరగా.. వీడియోలో జరిగిన సంభాషణ ప్రకారం చెల్లింపులు చేపట్టలేదన్నారు. దీంట్లో తన ప్రమేయం లేదని కమిటీ సభ్యులు ఒత్తిడికి గురి చేసినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details