గణతంత్ర దినోత్సవ గొప్పతనానికి ప్రతీకగా విశాఖ ఐదవ వార్డు పరిధిలోని స్వతంత్ర నగర్లో వెయ్యి అడుగుల జెండాను ప్రదర్శించారు. ఆర్ఎస్ఏ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్ధులు, స్ధానికులు ఈ జాతీయ జెండా ప్రదర్శనలో పాల్గొన్నారు.
విశాఖలో వెయ్యి అడుగుల జాతీయ పతాక ప్రదర్శన - flag hosting in vishaka
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లాలో వెయ్యి అడుగుల జాతీయ పతకాన్ని ప్రదర్శించారు. గణతంత్ర దినోత్సవం గొప్పతనం తెలియచేస్తూ జెండాను విద్యార్థులు గ్రామంలో ప్రదర్శించారు.
రిపబ్లిక్ డే సందర్భంగా విశాఖ జిల్లా రోలుగుంట మండలం పూసల పూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 140 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ఈ వేడుక గ్రామంలో ఎంతగానో ఆకట్టుకుంది. గ్రామానికి చెంది.. వృత్తిరీత్యా విశాఖలో స్థిరపడిన వ్యాపారవేత్త ఎం. రాజబాబు జాతీయ జెండాను తయారు చేయించి పాఠశాలకు అందజేశారు. ఈయన ఇప్పటికే గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సొంత నిధులను వెచ్చించి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ క్రమంలోనే పాఠశాలకు ఈ భారీ జాతీయ త్రివర్ణ పతాకాన్ని అందజేశారు. దీన్ని మండల వైకాపా పార్టీ అధ్యక్షులు మడ్డు అప్పలనాయుడు లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఇవీ చదవండి:జీవరక్ష పతకాల్లో... కొత్తకోట బాలికకు చోటు