విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని రైవాడ జలాశయాన్ని కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ నిపుణుల బృందం సందర్శించింది. ఐదున్నర కిలోమీటర్ల పొడవున్న జలాశయ ప్రధాన మట్టిగట్టును పటిష్టం చేసేందుకు రూ.10 కోట్ల నిధులకు అంచనావేసి అధికారులకు ప్రతిపాదనలు పంపించింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు మట్టిగట్టు, స్పిల్ వే గేట్లను బృంద సభ్యులు తనిఖీ చేశారు. కేంద్ర విశ్రాంత వాటర్ కమిషన్ చైర్మన్ ఏబీ పాండ్య, పుణె ఇంజినీరింగ్ ఇరిగేషన్ నిపుణులు ఈశ్వర్ చౌదరి, ఇరిగేషన్ సలహాదారు పీఎస్ఎన్ రెడ్డి, ఏపీ సలహాదారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.