విశాఖ పట్నం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కొవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలు, మాక్ సెంటర్లలో వాక్సినేషన్ ఉదయం 8 గంటల నుంచే ఆరంభమైంది. కోవాక్సిన్, కోవిషీల్డ్ మొదటి, రెండవ డోస్ లు అందుబాటులో ఉంచారు. హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు.
VACCINATION: ముమ్మరంగా కొవిడ్ టీకా పంపిణీ - Vishakhapatnam news
విశాఖ జిల్లాలో పత్యేక కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. అన్ని పీహెచ్సీ, ఇతర ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో ఉదయం నుంచే వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా సాగింది.
ఐదేళ్లలోపు వయస్సు పిల్లల తల్లులకు టీకాలను వేసేందుకు విస్తృతంగా ఏర్పాటు చేశారు. దీనికి అవసరమైన ప్రచారాన్ని ముందుగా చేశారు. పట్టణ ప్రాంతాలలో స్పందన బాగున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అంతగా కానరాలేదు. అర్హులైన ప్రతి ఒకరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పిలుపునిచ్చారు. విశాఖ నగర వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో వాక్సిన్ అందుబాటులో ఉంచినట్టు జీవీఎంసీ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి వివరించారు.
ఇదీ చదవండి:కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం: అయ్యన్నపాత్రుడు