విశాఖ కంచరపాలెం దుర్గానగర్ ప్రాంతానికి చెందిన దున్న వెంకటరావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న అతడు.. నిన్న రాత్రి తన గదిలో నిద్రపోయాడు. తెల్లవారినా బయటకు రాకపోవటంతో అతడి కుటుంబీకులు గదిలోకి వెళ్లి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉన్నాడు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
అంతులేని అప్పులు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య - Software employee commits suicide in Visakhapatnam
అప్పుల బాధ తాళలేక ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ కంచరపాలెంలో ఈ ఘటన జరిగింది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య