విశాఖ ఏజెన్సీ పాడేరులో అటవీ డివిజనల్ అధికారి వినోద్ కుమార్ ఇంట్లో పాము చొరబడింది. సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భాస్కర్ అనే యువకుడికి సమాచారమిచ్చారు. విషపూరితమైన రక్తపింజరను అతను చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టాడు. అతని ధైర్యాన్ని స్థానికులు అభినందించారు.
రక్తపింజరను చాకచక్యంగా పట్టుకున్న యువకుడు
సాధారణంగా పాము కనిపిస్తేనే భయంతో ఆమడ దూరంలో ఉంటాం. అలాంటిది విష పూరితమైన పాము అని తెలిసి కూడా చాకచక్యంగా పట్టుకున్న ఆ యువకుడిని స్థానికులు అభినందించారు. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరులో జరిగింది.
రక్తపింజరను చాకచక్యంగా పట్టుకున్న యువకుడు...అభినందించిన స్థానికులు