విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం కే.కోడాపల్లి పంచాయతీ బంధవీధి సమీపంలోని రహదారి చాలా ఏళ్లుగా ప్రమాదభరితంగా ఉంది. జి.మాడుగుల నుంచి పాడేరు నిత్యం వందల వాహనాలు తిరుగుతూ ఉంటాయి. గతంలో ఈ మార్గంలో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డారు. అధికారులకు స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మరమ్మతులకు నోచుకోలేదు. అయితే జి.మాడుగుల సీఐ జి. బాబు, ఎస్సై ఉపేంద్ర, ట్రైనీ ఎస్సై శ్రీను.. అడుగు ముందుకేశారు. రోడ్డు మరమ్మతులు చేపట్టారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పోలీసుల సేవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీలో పోలీసుల ప్రజాసేవ.. రహదారికి మరమ్మతులు - visakha agency
విశాఖ ఏజెన్సీలో జి.మాడుగుల పోలీసులు ప్రజాసేవలో పాల్గొంటున్నారు. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రహదారుల పనులు చేయించడం వల్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
road repairing under the g.madugula police