నిన్నటి వరకు ఐఏఎస్ హోదాలో బిజీగా గడిపిన ఆ అధికారి ఇప్పుడు వరి నూర్పిడి పనుల్లో పాల్గొని సాగుపై తనకున్న మమకారం చాటుకున్నారు. రాష్ట్ర పునరావాస కమిషనర్‌గా పనిచేసిన తమర్భ బాబురావు నాయుడిది విశాఖ జిల్లా పాడేరు మండలం మారుమూల డోకులూరు స్వగ్రామం. రాష్ట్రంలోని ఆదివాసీలలో తొలి ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందిన ఆయన... పలు పదవులు చేపట్టారు. కడప జిల్లా కలెక్టర్‌గా, విశాఖపట్నం ఉడా ఛైర్మన్‌గా సేవలందించారు. 2020 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే స్వగ్రామానికి చేరుకుని పొలం పనుల్లో నిమగ్నమయ్యారు
నిన్నటి వరకు ఐఏఎస్‌గా సేవలు... ఇప్పుడు రైతుగా పొలం పనులు - T babu rao naidu IAS news
ఐఏఎస్ అధికారిగా పలు పదవులు అలంకరించిన ఆయన... ప్రస్తుతం వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. పదవీ విరమణ చేసిన వెంటనే స్వగ్రామానికి చేరుకుని పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

A retired IAS officer is doing farming in Visakhapatnam district