ఓ తల్లి శునకం విశాఖ జిల్లా పాడేరు గ్రంథాలయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. తన వెంటనే పిల్ల శునకం ఆడుకుంటూ నడుస్తోంది. అయితే హఠాత్తుగా ఓ వాహనం పిల్ల కుక్కను ఢీ కొట్టడంతో చనిపోయింది. తన బిడ్డ.. వెనకే వస్తుందనుకున్న తల్లికి.. పిల్ల విగతజీవిగా ఉండిపోవడం చూసి తల్లడిల్లిపోయింది. దగ్గరికి వెళితే అయిన వస్తుందేమోననుకున్నా నిరాశే ఎదురైంది. ఏం చేయాలో తెలియని తల్లి శునకం.. అటు.. ఇటు తిరగసాగింది. కోపంతో రోడ్డుపైన వెళుతున్న వాహనదారులను బెదిరించింది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు చలించిపోయారు.
బిడ్డను ఆ పరిస్థితిలో చూడలేక.. వదలిపోలేక.. అల్లాడిపోయిన అమ్మ ప్రేమ! - mother dog story in paderu
సృష్టిలో అమ్మ ప్రేమను మించినది ఏదీలేదు. తనకేదైనా తట్టుకుంటుంది గానీ.. తన బిడ్డకు ఏదైనా.. అయితే అస్సలు తట్టుకోలేదు. అలాంటి ఘటనే విశాఖ మన్యంలో జరిగింది. ఓ తల్లిశునకం.. తన బిడ్డ శునకానికైన ప్రమాదాన్ని చూసి తల్లడిల్లిపోయింది. వదల్లేక.. అక్కడే ఉండిపోయింది.

బిడ్డను ఆ పరిస్థితిలో చూడలేక.. వదలిపోలేక.. తల్లడిల్లిన తల్లి శునకం!
బిడ్డను ఆ పరిస్థితిలో చూడలేక.. వదలిపోలేక.. తల్లడిల్లిన తల్లి శునకం!