ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిత్యావసరాల ధరలను అదుపు చేయాలని కోరుతూ నిరసన

By

Published : Nov 1, 2020, 8:28 AM IST

పెరుగుతున్న నిత్యావసరాల ధరలను తగ్గించి ప్రజలను ఆదుకోవాలని కోరుతూ... తెలుగు మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

protest againest government
నిత్యావసర ధరలను తగ్గించాలి

రోజురోజుకు మిన్నంటుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయాలని కోరుతూ... తెలుగు మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ జిల్లా మునగపాకలో గాంధీ విగ్రహం ఎదుట ఈ సంఘటన జరిగింది. నిత్యావసర కూరగాయల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అనకాపల్లి ఎంపీ, తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు, కార్యదర్శి సకల రమణమ్మ అన్నారు.

ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పెరిగిపోతున్న ధరల కారణంగా అన్ని వర్గల వారు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అమరావతి రైతులకు సంకెళ్ళు వేయడం దారుణమని వ్యాఖ్యనించారు.

ABOUT THE AUTHOR

...view details