ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 16, 2020, 11:12 PM IST

ETV Bharat / state

గిరిపుత్రులకు తప్పని తిప్పలు... డోలీలే దిక్కు

ఎన్ని సంవత్సరాలు గడిచినా గిరిపుత్రుల కష్టాలు పట్టించుకునే నాథుడే లేడు. గర్భీణీకి పురిటినొప్పుల వస్తే ఆమెను రహదారి వరకూ డోలీలోనే మోసుకుంటు తీసుకురావాల్సిందే. తాజాగా హుకుంపేట మండలంలోని మారుమూలు ప్రాంతంలో ఓ గర్భిణీని స్థానికులు 4 కిలోమీటర్లు మోసుకుంటూ అంబులెన్స్ వరకూ తీసుకొచ్చారు.

a pregent lady came from  doli at visakha  dst tribal area
a pregent lady came from doli at visakha dst tribal area

విశాఖ మన్యం హుకుంపేట మండలం మారుమూల తీగలవలస పంచాయతీ పనసబందలో చిలకమ్మా అనే నిండు గర్భిణీని స్థానిక యువకులు డోలీ కట్టి కిలోమీటర్లు మేర మోసుకుని వచ్చారు. చీకటిలో సెల్ ఫోన్ వెలుగుతో నాలుగు కిలోమీటర్లు మోసుకుని రహదారి వద్దకు మోసుకుని వచ్చారు. ఆపై అంబులెన్స్ లో హుకుంపేట ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ వచ్చే మార్గాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.

ఇదీ చూడండిఉమ్మెత్త విత్తనాలు తిన్నారు..ఆస్పత్రి పాలయ్యారు

ABOUT THE AUTHOR

...view details