ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

29న మన్యం బంద్​ను జయప్రదం చేయండి: గిరిజన సంఘం - centre and state on tribal areas

ఎస్టీ రిజర్వేషన్, ఏజెన్సీ ప్రాంతాలను 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ సెప్టెంబర్​ 29న గిరిజన సంఘం మన్యం బంద్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ మన్యం బంద్​ను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ సంఘం పోస్టర్ ఆవిష్కరించింది.

29న మన్యం బంద్​ను జయప్రదం చేయాలంటూ పోస్టర్ విడుదల
29న మన్యం బంద్​ను జయప్రదం చేయాలంటూ పోస్టర్ విడుదల

By

Published : Sep 27, 2020, 7:07 PM IST

ఎస్టీ రిజర్వేషన్లు, ఏజెన్సీ ప్రాంతాలను 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ సెప్టెంబర్​ 29న గిరిజన సంఘం మన్యం బంద్​ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ నేపథ్యంలో పాడేరు గిరిజన సంఘం కార్యాలయంలో ఆంధ్ర, తెలంగాణ బంద్​ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పలనర్స పోస్టర్లను విడుదల చేశారు.

సుప్రీం చర్యలతో అది అందని ద్రాక్షే..

జీఓ నెంబర్ 3 రిజర్వేషన్​ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 22న రద్దు చేయడం వల్ల 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల ఆదివాసీలకు అందని ద్రాక్షగా మారిందని అప్పలనర్స ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత జీఓను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరుద్ధరణ చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు.

ఆదివాసీల పట్ల నిర్లక్ష్యం..

కరోనా కాలంలో కేంద్రం 11 రకాల ఆర్డినెన్సులను జారీ చేసిందన్నారు. జీఓ నెంబర్ 3 రిజర్వేషన్​ను సుప్రీం రద్దు చేస్తే కనీసం ఆర్డినెన్స్ జారీ చేయకపోవడం ఆదివాసీల పట్ల ప్రభుత్వాలకు ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని చెప్పారు.

బాధ్యతారాహిత్యంగా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవరిస్తున్నాయన్నారు. కొవిడ్ - 19 పేరుతో జీఓ నెంబర్ 68ను అమలు చేయకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు వల్ల స్థానిక గిరిజనులకు నష్టం వాటిల్లిందని వాపోయారు.

స్పష్టమైన విధి విధానాలు ఏవీ?: సంఘం

ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగుల బదిలీ పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలు ప్రకటించాలని కోరారు. 100 శాతం రిజర్వేషన్లు చట్ట వ్యతిరేకమని.. 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండరాదని సుప్రీం ఇచ్చిన తీర్పుపై కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్, షెడ్యూల్డ్ ఏరియాలో స్థానిక ఆదివాసీలు పొందుతున్న రిజర్వేషన్​ను 9వ షెడ్యూల్​లో చేర్చేందుకు న్యాయ సమీక్షకు అవకాశం ఉండదన్నారు.

కేంద్రం కలగజేసుకోవాలి..

అక్టోబర్ 1 వరకు జరగాల్సిన పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్ 24కు కుదించి, నిరవధికంగా ప్రభుత్వం వాయిదా వేసినందున కేంద్రం తమ సమస్యల పరిష్కారానికి ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ ఏరియాలో కేంద్ర, రాష్ట్ర రాజ్యాంగ అధిపతులు రాష్ట్రపతి, గవర్నర్ ద్వారానే పరిపాలన సాగించాలన్నారు. గవర్నర్ అధికారాన్ని తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ప్రశ్నించినందున కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. పాడేరు, పెదబయలు, అరకులోయ, డుంబ్రిగూడ మండలాల పరిధిలో ఆయా మండల గిరిజన సంఘ నాయకులు బంద్ పోస్టర్ల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

'షీర్‌జోన్‌, ఉపరితల అవర్తనం ప్రభావంతోనే భారీ వర్షాలు'

ABOUT THE AUTHOR

...view details