విశాఖ జిల్లా పెందుర్తిలోని సాదు మఠం జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంతపాలెం గ్రామానికి చెందిన రమణ(42) ద్విచక్రవాహనంపై వెళుతుండగా జంక్షన్ వద్ద లారీ ఢీకొట్టింది. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. వ్యక్తి మృతి - lorry and bike accident at pendurthi
ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలోని సాదు మఠం జంక్షన్ వద్ద జరిగింది.
ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి