ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐటమ్ సాంగ్​లో ఛాన్స్​ అన్నాడు.... ఐదు లక్షలు నొక్కేశాడు... - విశాఖలో సినిమా మోసం

సినిమాల్లో ఐటమ్ సాంగ్ పేరిట యువతికి టోకరా వేసిన ఘటన విశాఖలో కలకలం రేపింది. గీతాలయా స్టూడియో పేరిట కొద్దిరోజుల క్రితం పేపర్లో ప్రకటన ఇచ్చిన సంస్థ నిర్వహకుడు గీతా ప్రసాద్ ఓ యువతిని మోసం చేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

a person cheated a girl  for chance in cinema at visakha
సినిమాల్లో ఐటమ్ సాంగ్ పేరిట యువతికి టోకరా

By

Published : Jun 19, 2020, 3:30 PM IST

Updated : Jun 19, 2020, 6:28 PM IST

సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ పేరిట విశాఖ జిల్లాలో ఓ యువతికి టోకరా వేశాడు ఓ వ్యక్తి. సినిమాలో ఒక పాటకు రూ. 10 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ అంటూ గీతాలయా స్టూడియో పేరిట సంస్థ నిర్వహకుడు గీతా వెంకట ప్రసాద్ కొద్దిరోజుల క్రితం పేపర్​లో ప్రకటన ఇచ్చాడు.

ఆ ప్రకటన చూసి 10 మంది యువతులు ఆడిషన్స్​కి వెళ్లారు. లాక్​డౌన్ ఉన్నందున ఎటువంటి అవకాశాలు ఇప్పించకపోవడంతో 9 మంది యువతులు వెనుదిరిగారు. కానీ ఓ యువతికి మాయమాటలు చెప్పి తాను తీస్తున్న చిత్రానికి బడ్జెట్ సరిపోలేదని కొంత డబ్బులు సహాయం చేయమని గీతాప్రసాద్​ కోరాడు. ఆమె వద్ద నుంచి రూ. 5 లక్షలను రెండు దఫాలుగా వసూలు చేశాడు.

సినిమా షూటింగ్ జరగకపోవడంతో తన నగదు ఇవ్వాలని గీతా వెంకట ప్రసాద్​ను యువతి నిలదీసింది. హోటల్​కు వస్తే డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మించి రప్పించి అప్పటికే అక్కడ మాటువేసుకుని ఉన్న గీతా వెంకట ప్రసాద్​తోపాటు మరో ఇద్దరు తనను చంపేస్తామని బెదిరించారని బాధితురాలు పేర్కొంది.

స్టూడియో వివరాలు తెలుపుతున్న విశాఖపశ్చిమ ఏసీపీ స్వరూపారాణి

తనకు ప్రాణహాని ఉందని గ్రహించి వెంటనే వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం అమ్మాయిని పోలీసులు పిలిచి వాస్తవాలను తెలుసుకున్నారు. గీతా ప్రసాద్​తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పశ్చిమ ఏసీపీ స్వరూపారాణి తెలిపారు.

వివరాలు తెలుపుతున్న మోసపోయిన యువతి

సినిమా ఛాన్సులిస్తానని పిలిచి నన్ను మోసం చేశారు. ఒక్క ఐటెం సాంగ్​ కోసం రూ. 5 లక్షలు తీసుకున్నాడు. ఛాన్సుల కోసం డైరెక్టర్లకు డబ్బులైన ఇవ్వాలి లేదా! కమిట్​మెంట్​ అయినా ఇవ్వాలి. షూటింగ్ జరగకపోయేసరికి అనుమానమొచ్చి..గీతా వెంకట ప్రసాద్​ను అడిగితే ఇప్పుడిస్తా... అప్పుడిస్తా అని మోసం చేశాడు. చివరికి ఓ హోటల్​లో డబ్బు ఇస్తానని చెప్పి అక్కడికి పంపించాడు. డబ్బుల కోసం వెళ్తే...ఓ వ్యక్తి కమిట్​మెంట్​ ఇవ్వమన్నాడు. నేను ఒప్పుకోకపోయేసరికి వాళ్లందరూ చంపేస్తామని బెదిరించారు. చివరికి ఏసీపీ స్వరూపారాణి మేడమ్​కి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశా. నాలాంటి వాళ్లేందరో ఉన్నారు. మాకు తగిన న్యాయం చేయాలి. - బాధితురాలు

ఇదీ చూడండి.అతనో ఎంపీ అని మరిచిపోయారా..?

Last Updated : Jun 19, 2020, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details