విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెద రామభద్రపురం గ్రామంలో ఓ యువకునికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కాకినాడలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఓ యువకుడురెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అతనికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా కొవిడ్ సోకినట్లు తెలిసింది. దీంతో గ్రామంలోని వైద్య, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలోని పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు.
పాయకరావుపేట మండలంలో యువకునికి కరోనా పాజిటివ్ - visakha district latest corona news
కాకినాడ నుంచి పాయకరావుపేట మండలానికి వచ్చిన ఓ యువకునికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు నిర్ధరించారు. విషయం తెలుసుకున్న గ్రామ అధికారులు అప్రమత్తమయ్యారు.

యువకునికి కరోనా పాజిటివ్