ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యాపారి మృతదేహం తరలింపునకు వర్తకుల సాయం - పాడేరు నేటి వార్తలు

పొట్టకూటి కోసం విశాఖ జిల్లా వచ్చిన ఓ పాత దుస్తుల వ్యాపారి.. పాడేరులో ఈ ఉదయం ఆకస్మికంగా మృతిచెందాడు. అయితే 108 సిబ్బంది ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేయగా.. పాడేరు వర్తకులు చందాలు వేసుకొని స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి పంపారు.

cloth merchant died at Paderu
పాడేరులో పాతపట్టల వ్యాపారి మృతి

By

Published : Apr 12, 2021, 9:22 PM IST

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గోపి అనే పాత దుస్తుల వ్యాపారి.. విశాఖ జిల్లా పాడేరులోని శ్రీనివాస లాడ్జ్ వద్ద ఫిట్స్ వచ్చి పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 సిబ్బంది.. బతికించేందుకు ప్రయత్నించినా ఆతని ప్రాణాలు కాపాడలేకపోయారు.

అయితే 108 సిబ్బంది అతడి మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లడంతో ఇవాళ కురిసిన వర్షానికి తడిసిపోయింది. దీంతో స్థానిక వర్తకులు మృతుని భార్యకు సమాచారం అందిచారు. పాడేరు వర్తక సంఘం వాట్సాప్ గ్రూపు ద్వారా వ్యాపారులు.. రూ. 30 వేలు చందాలు వసూలు చేసి మృతదేహం రాజమహేంద్రవరం తీసుకేళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అనాథలా పడి ఉన్న గోపి మృతదేహానికి వ్యాపారులు చేసిన సాయాన్ని సహాయాన్ని అందరూ అభినందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details