తమిళనాడుకు చెందిన అంబు చార్లెస్ పర్యావరణ ప్రేమికుడు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం 2005లో సైకిల్ యాత్ర చేపట్టారు. దేశవ్యాప్తంగా నలుమూలలా తిరగుతూ ఇప్పటివరకు 62 వేల కిలోమీటర్లకు పైగా యాత్ర చేపట్టారు. ఈ మేరకు ఆయన యాత్ర విశాఖ జిల్లా పాడేరుకు చేరుకుంది. పట్టణంలో ఆల్ ఇండియా తౌహీద్ జమాత్ పౌండేషన్‌కు చెందిన ముస్లింలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మెడలో ప్లాస్టిక్ డబ్బాలు, జంక్ ఫుడ్ కవర్లతో యాత్ర చేపడుతూ వాటికి వ్యతిరేకంగా ప్రచారం కల్పిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణకు.. దేశవ్యాప్త సైకిల్ యాత్ర - vishaka
పర్యావరణ పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తున్నాడో వ్యక్తి, పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ...గత 14 సంవత్సరాలుగా దేశనలుమూలలా తిరుగుతూ 62 వేల కిలోమీటర్లకుపైగా సైకిల్‌పై యాత్ర చేపట్టారు. ఆయన తలపెట్టిన యాత్ర విశాఖ జిల్లా పాడేరుకు చేరుకుంది.
సైకిల్ యాత్ర