కొవిడ్ తగ్గి..ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓ వ్యక్తి పశ్చిమ బంగాల్ నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నారు. ఖరగ్‌పూర్‌కు చెందిన రవి అనే వ్యక్తి కిళ్లీ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. కరోనా తగ్గాలని రోజుకి 20 కిలీమీటర్లు నడుస్తూ..ఈ రోజు విశాఖ జిల్లా అనకాపల్లికి చేరుకున్నారు. పట్టణంలోని గౌరీ సేవా సంఘం సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. గౌరీ పంచాయతన దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి .. తిరుపతి బయల్దేరారు. కొవిడ్ అందరి జీవితాలు నాశనం చేసిందని ..దీని ప్రభావం తగ్గి కరోనా లేని సమాజం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందడానికి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నానని రవి వివరించారు.
కొవిడ్ తగ్గాలని ఖరగ్‌పూర్ నుంచి తిరుపతికి పాదయాత్ర
కరోనా మహమ్మారి తగ్గాలని పశ్చిమ బంగాల్ ఖరగ్‌పూర్ నుంచి తిరుపతికి ఒక వ్యక్తి పాదయాత్ర చేపట్టారు. నవంబర్ 10న ఈ యాత్ర ప్రారంభించగా.. పాదయాత్ర ద్వారా విశాఖ జిల్లా అనకాపల్లికి చేరుకున్నారు.
కోవిడ్ తగ్గాలని ఖరగ్‌పూర్ నుంచి తిరుపతికి ఓ వ్యక్తి పాదయాత్ర
TAGGED:
కరోనా వార్తలు