విశాఖ జిల్లా పెందుర్తిలో కాలువలో పడి చిక్కాల అప్పారావు (60) మృతి చెందారు. మూడు రోజులుగా కనపడట్లేదని కుటుంబ సభ్యులు పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చివరికి ప్రమాదవశాత్తు కాలువలో శవమై తేలుతూ కనిపించాడు. ఈయనకు బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధి ఉండడంతో అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ కి తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు కాలువలో పడి ఓ వ్యక్తి మృతి - vishaka district
ప్రమాదవశాత్తు కాలువలో పడి ఓక వ్యక్తి మృతి చెందిన ఘటన విశాఖ పెందుర్తిలో చోటు చేసుకుంది.
పెందుర్తి లో ఓ వ్యక్తి కాలవలో పడి మృతి