పశువుల కోసం చెరువు దాటుతూ...మధ్యలో ఊపిరాడక ఓ వ్యక్తి నీట మునిగాడు. విశాఖ జిల్లా మాడుగుల మండలం సాగరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పాము కొండలరావు అనే రైతు పశువుల కోసం చెరువులో నుంచి అవతల ఒడ్డుకు వెళ్తుండగా గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది రాత్రి వరకు గాలించినప్పటికి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పశువుల కోసం చెరువు దాటుతూ వ్యక్తి గల్లంతు - విశాఖలో చెరువు దాటుతూ వ్యక్తి గల్లంతు..
పశువుల కోసం చెరువు దాటుతూ...ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి నీట మునిగాడు .అగ్నిమాపక సిబ్బంది గాలించినప్పటికి ఆచూకీ లభించలేదు.

వ్యక్తి గల్లంతు.