విశాఖ మన్యం పాడేరులో రైతులను ఓ ప్రబుద్ధుడు మోసం చేశాడు. లోను ఇప్పిస్తానంటూ వారి వద్ద డబ్బులు తీసుకుని ఉడాయించాడు. చివరికి ఎలాగోలా రైతులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
విశాఖ జిల్లా పెదబయలు మండలం గంపరాయికి చెందిన గోపాల్రావు అనే వ్యక్తి హార్టికల్చర్ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. నకిలీ గుర్తింపు కార్డు చూపించి అందర్నీ నమ్మించాడు. ప్రభుత్వ పథకాల పేర్లు చెప్పి కొంత డబ్బు కడితే లోను వస్తుందని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన అన్నదాతలు రూ. 3,300 నుంచి రూ. 40 వేల వరకూ అతనికి కట్టారు. అయితే నెలలు గడిచినా వారికి లోను రాకపోవటంతో అతనిని ప్రశ్నించారు. దీంతో అతను ఊరు వదిలి వెళ్లిపోయాడు. మెసేజ్ల ద్వారా అక్కడున్నాను, ఇక్కడున్నానంటూ చెప్పాడు.