ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రక్తదానంపై అవగాహన కల్పిస్తూ.. సైకిల్​పై 9 వేల కి.మీ. ప్రయాణం - రక్తదానంపై అవగాహన కల్పిస్తున్న కోల్​కతా వాసి

రక్తదానం చేయటంపై ప్రజల్లో ఎన్నో అపోహలు..అనుమానాలు ఉంటాయి. వాటన్నింటిని తొలగించి అందరిలో చైతన్యం నింపేందుకు కోల్​కతాకు చెందిన ఓ వ్యక్తి వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. సైకిల్​పై దేశమంతా పర్యటిస్తూ.. రక్త దానంపై  అవగాహన కల్పిస్తున్నారు.

A man compaign entire country for raising awareness on blood donation
రక్తదానంపై అవగాహన కల్పిస్తూ..సైకిల్​పై 9 వేల కి.మీ. ప్రయాణం

By

Published : Dec 19, 2019, 10:23 PM IST

Updated : Dec 26, 2019, 4:59 PM IST

రక్తదానంపై అవగాహన కల్పిస్తూ..సైకిల్​పై 9 వేల కి.మీ. ప్రయాణం

''రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి. మీరు ఇచ్చే రక్తం ఆపద సమయంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది'' అన్న సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. వారిలో చైతన్యం నింపేలా కోల్​కతాకు చెందిన ఓ వ్యక్తి సైకిల్ యాత్ర చేపడుతున్నారు. జయదేవ్ రాహుత్ అనే వ్యక్తి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కోల్​కతా నుంచి కన్యాకుమారి వరకూ.. తిరిగి కన్యాకుమారి నుంచి కోల్​కతా వరకూ.. మెత్తం 9వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రస్తుతం విశాఖ జిల్లా అనకాపల్లి చేరుకున్న ్తడికి స్థానిక యువకులు స్వాగతం పలికి.. ఆయన్ను, ఆయన ఆశయాన్ని ప్రశంసించారు. గతంలో తనకు రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డానని.. బంధువులు సైతం రక్తాన్ని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదని జయదేవ్ రాహుత్ తెలిపారు. అప్పుడే రక్తదానంపై ప్రజల్లో ఉండే అపోహలను తొలగించాలని నిశ్చయించుకున్నట్టు చెప్పారు. అనుకున్నదే తడువుగా సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. మెదట కోల్​కతా నుంచి ప్రారంభించారని.. ఇప్పుడు కన్యాకుమారి వరకూ యాత్ర చేపడుతున్నట్లు ఈటీవీ భారత్​కు వివరించారు.

Last Updated : Dec 26, 2019, 4:59 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details