ఓ వ్యక్తిని మహిళ హతమార్చిన ఘటన శనివారం అర్ధరాత్రి విశాఖలో చోటు చేసుకుంది. నాయిని సంతోశ్(30) అనే వ్యక్తి.. భార్యాపిల్లలతో కలిసి విశాఖలోని మధురవాడలో నివాసముంటున్నాడు. సంతోశ్.. పండావీధిలోని సహీల్ ట్రేడింగ్ కంపెనీలో పని చేసేవాడు. ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న భవానీ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భవానీ ఫోన్ చేసి సంతోశ్‌ను ఇంటికి పిలిచింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో భవానీ.. సంతోశ్‌ను కత్తితో పొడిచి హతమార్చింది.
వీరి మధ్య వివాహేతర సంబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. నిందితురాలి తండ్రి సమాచారం మేరకు వన్‌టౌన్ పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని భవానీని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.