ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ సంబంధం అని అనుమానం.. వ్యక్తిపై హత్యాయత్నం - అగ్రహారం తాజా వార్తలు

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి చేశాడో భర్త. ఈ ఘటన విశాఖ జిల్లా నక్కపల్లి మండలం దోసలపాడు అగ్రహారం గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

a man attacked to another man with a knife at agraharam
భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి

By

Published : Sep 27, 2020, 10:55 PM IST

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం దోసలపాడు అగ్రహారం గ్రామంలో ఓ వ్యక్తి పై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కొల్లి అప్పలరాజు అనే వ్యక్తి తన భార్యతో... కొల్లి శ్రీనుకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కక్ష పెంచుకున్నాడు.

పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న శ్రీనుపై అప్పలరాజు కత్తితో దాడి చేశాడు. బాధితునికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details