ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

lorry burned: జాతీయ రహదారిపై లారీ దగ్ధం.. - జాతీయ రహదారిపై లారీ దగ్ధం

విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై రాత్రి ప్రమాదవశాత్తు ఓ లారీ(a lorry burned at kagita toll plaza) దగ్ధమయ్యింది. ఇంజిన్​లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి.

a lorry burned at kagita toll plaza
కాగిత టోల్ గేట్ లారీ దగ్ధం

By

Published : Nov 10, 2021, 9:55 PM IST

కాగిత టోల్ గేట్ వద్ద లారీలో చెలరేగిన మంటలు.. లారీ దగ్ధం

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై రాత్రి ప్రమాదవశాత్తు ఓ లారీ దగ్ధమయ్యింది. తెలంగాణలోని కోదాడ నుంచి అనకపల్లికి సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ.. టోల్ గేట్ వద్ద ఆగింది. ఈ క్రమంలో డ్రైవర్ భోజనం చేస్తుండగా లారీలోని ఇంజిన్​లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే వాహనాన్ని చుట్టుముట్టాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది..ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే వాహనం చాలా మేర కాలిపోయింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్​కు స్వల్ప గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details