విశాఖ జిల్లా అనంతగిరి మండలం జీనబాడు గ్రామానికి చెందిన ఓ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. మౌళి అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోకుంటే దూకేస్తానని బెదిరించింది. వివరాల్లోకి వెళ్తే.. 4 ఏళ్ల క్రితం చెన్నైకు చెందిన వ్యక్తితో ఆ మహిళకు వివాహం జరిగింది. వారికి మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇటీవల ఆమె భర్త చనిపోవటంతో తన బాబుని తీసుకుని పుట్టింటికి వచ్చింది. ఆమెకు దగ్గర బంధువైన అనంతగిరి మండలం పెదకోట గ్రామానికి చెందిన సిరగం మౌళితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తనను రెండో పెళ్లి చేసుకోవాలని మౌళిపై ఆ మహిళ ఒత్తిడి తెచ్చింది. అయితే అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నందున పెళ్లికి నిరాకరించాడు. దీనితో మహిళ రైవాడ గేట్లపైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. శనివారం సాయంత్రం దేవరాపల్లి సంతకు వచ్చిన మహిళ అక్కడున్న వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కింది. మౌళితో వివాహం చేయకుంటే దూకేస్తానని బెదిరించింది. దీనితో మౌళి మంచినీటి పథకంపైకి వెళ్లి పెళ్లి చేసుకుంటానని ఆమెకు నచ్చచెప్పి కిందకు తీసుకువచ్చాడు. ఆమె సురక్షితంగా కిందికి రావటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
రెండో పెళ్లికి నిరాకరించాడని...వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ - విశాఖ జిల్లా జీనబాడు
వివాహం చేసుకుంటానని చెప్పి ప్రేమాయణం సాగించిన వ్యక్తి ముఖం చాటేశాడు. దీనితో గిరిజన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసింది. ఆ తర్వాత ఏమైందంటే...
![రెండో పెళ్లికి నిరాకరించాడని...వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4670141-34-4670141-1570361765659.jpg)
మోసపోయిన యువతి వాటర్ ట్యాంక్ ఎక్కింది... ఎందుకంటే?
రెండో పెళ్లికి నిరాకరించాడని...వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ
ఇదీ చదవండి :
Last Updated : Oct 7, 2019, 9:01 AM IST