ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా చేపలు పడ్డాయనుకున్నారు... కానీ .. - విశాఖలో మత్స్య కారుల వలకు భారీ తిమింగలం

విశాఖ జిల్లాలో మత్స్యకారులకు వలకు భారీ తిమింగలం చిక్కింది. భారీ మొత్తంలో చేపల పడ్డాయని... వలను తీరానికి లాక్కొని రాగా.. 30 అడుగుల భారీ తిమింగలం కనిపించింది. ఇలా తిమింగాలలు వలలకు చిక్కుడానికి... రసాయన వ్యర్థాలను సముద్రంలో వదిలేస్తుండటమే కారణామని మత్స్యకారులు తెలిపారు.

huge whale
huge whale

By

Published : Mar 21, 2022, 4:22 PM IST

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని ముత్యాలమ్మపాలెం తీరంలో మత్స్యకారులకు 30 అడుగుల భారీ తిమింగలం చిక్కింది. పరవాడ మండలం వాడచీపురుపల్లికి చెందిన జాలర్లు తంతడిపాలెం సమీపంలో వేట కొనసాగిస్తుండగా... వలలో తిమింగలం పడింది. భారీ మెుత్తంలో చేపలు పడ్డాయని... వలను తీరానికి లాక్కొని రాగా తిమింగలం కనిపించింది. ప్రాణాలతో ఉండటాన్ని గమనించి... తిరిగి సముద్రం లోపలకు వదిలేశారు. ఇలా తిమింగాలలు వలలకు చిక్కుడానికి... రసాయన వ్యర్థాలను సముద్రంలో వదిలేస్తుండటమే కారణామని మత్స్యకారులు అంటున్నారు.

భారీగా చేపలు పడ్డాయనుకున్నారు... కానీ ..

ABOUT THE AUTHOR

...view details