విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బట్ట పనుల పంచాయతీ శివారు కాట్రగడ్డ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో దేశగిరి లక్ష్మణ్ రావు అనే గిరిజనుడు తాటాకు ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో విలువైన సామాగ్రితో పాటు... బంగారం, డబ్బు కూడా కాలిబూడిదైపోయాయి. పూర్తిగా నిరాశ్రయులైన తమను ప్రభుత్వం ఆదుకుని సహాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ మేరకు రెవెన్యూ సిబ్బంది ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్తో తాటాకు ఇల్లు దగ్ధం - విశాఖ షాట్ సర్క్యూట్
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ గిరిజనుడి తాటాకు ఇల్లు దగ్ధమైంది. దీంతో విలువైన సామగ్రితో పాటు... బంగారం, డబ్బు కూడా కాలి బూడిదైపోయాయి.
![షార్ట్ సర్క్యూట్తో తాటాకు ఇల్లు దగ్ధం house in the palm burnt down after a shot circuit](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9550018-67-9550018-1605430197444.jpg)
షాట్ సర్క్యూట్ తో తాటాకు ఇల్లు దగ్ధం