విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామానికి చెందిన ఓ యువతి అదృశ్యమవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి.. ఈ నెల 17వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గురువారం యువతి తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి గ్రామీణ ఎస్ఐ ఈశ్వరరావు తెలిపారు.
అనకాపల్లిలో యువతి అదృశ్యం..కేసు నమోదు - విశాఖ జిల్లా నేర వార్తలు
విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో ఓ యువతి ఆదృశ్యమవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అనకాపల్లి మండలంలో యువతి అదృశ్యం...కేసు నమోదు