ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నంలో నేటి నుంచి పూర్తి స్థాయి లాక్ డౌన్ - విశాఖ జిల్లా తాజా వార్తలు

కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ప్రకటించారు. నేటి నుంచి అత్యవసర సేవలు మినహా.. వాణిజ్య, వ్యాపార సంస్థలు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ పాటించాలని మున్సిపల్ చైర్మన్ గుదిబండ ఆదిలక్ష్మి తెలిపారు.

lock down
లాక్ డౌన్

By

Published : May 17, 2021, 9:59 AM IST

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ప్రకటించారు. నేటి నుంచి వారం రోజుల పాటు మున్సిపాలిటీ పరిధిలో అత్యవసర సేవలు మినహా, వాణిజ్య, వ్యాపార సంస్థలు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ పాటించాలని మున్సిపల్ ఛైర్మన్ గుదిబండ ఆదిలక్ష్మి తెలిపారు.

స్థానికంగా జరిగిన మున్సిపల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అత్యవసర, నిత్యావసర సరుకులు, ఇతర కూరగాయల విక్రయాలకు సంబంధించి ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. ప్రజలు , పరిసర గ్రామాల వారు సహకరించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details