ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాను జయించిన 4 నెలల పసికందు - corona positive cases in vishaka

విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రిలో కరోనా కోసం చికిత్స పొందుతున్న నాలుగు నెలల బాబు కోలుకున్నాడు. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వరప్రసాద్ నేతృత్వంలో చిన్నారికి మెరుగైన వైద్యం అందించారని జిల్లా కలెక్టర్‌ వినయ్ చంద్ అభినందించారు.

-vishaka
-vishaka

By

Published : Jun 13, 2020, 4:11 AM IST

Updated : Jun 13, 2020, 6:41 AM IST

4 నెలల పసివాడు కరోనా కోరల నుంచి బయటపడిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకొంది. తూర్పు గోదావరి జిల్లా గిరిజన ప్రాంతానికి చెందిన పసి బాలుడికి సుమారు 3 వారాల కిందట కరోనా సోకింది. మే 25న అత్యవసర పరిస్థితుల్లో విశాఖలోని విమ్స్ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు. సుమారు 18 రోజుల చికిత్స తర్వాత బాలుడు పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వరప్రసాద్ నేతృత్వంలో చిన్నారికి చక్కని వైద్యం అందించారని జిల్లా కలెక్టర్‌ వినయ్ చంద్ అభినందించారు.

Last Updated : Jun 13, 2020, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details