విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు పరిశ్రమకు చెందిన కార్మికులతో వెళుతున్న బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. ఒడిశా రాష్ట్రం నుంచి సుమారు 50 మంది కార్మికుల తో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలోని ఎస్ఎన్జీ పరిశ్రమకు ఈ బస్ బయలుదేరింది.
రహదారిపై బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం - Visakhapatnam District latest News
విశాఖ జిల్లా పాయకరావుపేట జాతీయ రహదారిపై కార్మికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తి గా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది.

రహదారిపై బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం
పాయకరావుపేట వచ్చే సరికి టైర్ పేలి మంటలు చెలరేగాయి. బస్ నడుపుతున్న డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రయాణికులను కిందికి దింపేశాడు. దీంతో భారీ ప్రాణనష్టం తప్పింది. భారీగా మంటలు వ్యాపించడంతో బస్ మొత్తం అగ్నికి ఆహుతి అయింది. తుని, నక్కపల్లి, యలమంచిలి అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలు అర్పారు.
రహదారిపై బస్సు దగ్ధం
ఇదీ చదవండి: కర్నూలులో అగ్ని ప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తి నష్టం