ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దువ్వాడ సెజ్‌లోని పూజా స్క్రాప్ పరిశ్రమలో అగ్నిప్రమాదం - అగ్నిప్రమాదం వార్తు

fire accident at duvvada sez
దువ్వాడ సెజ్‌లో అగ్నిప్రమాదం

By

Published : Apr 11, 2021, 1:25 PM IST

Updated : Apr 11, 2021, 10:56 PM IST

13:22 April 11

షార్ట్ సర్క్యూట్ కారణంగా పరిశ్రమలో మంటలు

దువ్వాడ సెజ్‌లో అగ్నిప్రమాదం

విశాఖ జిల్లా దువ్వాడలోని సెజ్​లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా.. సెజ్‌లోని పూజా స్క్రాప్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.

పూజా స్క్రాపు ఇండస్ట్రీలో కంప్యూటర్ విడిభాగాలు, ట్రాన్స్​ఫార్మర్లు, మీటర్లు, ఇతర వస్తువులు నిల్వ ఉంచుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఫైబర్ వస్తువులు ఎక్కువగా ఉండడంతో మంటలార్పడం సిబ్బందికి కష్టతరంగా మారింది.

ఇదీ చదవండి: 

పోట్లపాడులో విషాదం : రోడ్డు ప్రమాదంలో అక్కా, తమ్ముడు మృతి

Last Updated : Apr 11, 2021, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details