విశాఖ జిల్లా కోటవురట్ల మండలం అంజల్లూరు గ్రామానికి చెందిన రమణమూర్తి అనే ఓ దివ్యాంగుడు తన పింఛన్ సొమ్మును కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు విరాళంగా అందజేశారు. ఈ మేరకు నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతికి ఆయన ఈ మొత్తాన్ని అందజేశారు. రమణమూర్తికి ప్రతినెలా మంజూరవుతున్న 2000 రూపాయలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి.. వేయి రూపాయలను ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. రమణమూర్తి ఆదర్శాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆర్డీఓ సూచించారు.
ముఖ్యమంత్రుల సహాయనిధికి దివ్యాంగుడి విరాళం - lockdown effect
కరోనా వ్యాప్తి నివారణకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా అంజల్లూరుకు చెందిన ఓ దివ్యాంగుడు తన పింఛన్ సొమ్మును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయనిధికి ప్రకటించి స్ఫూర్తిగా నిలిచాడు.
ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఓ వికలాంగుని విరాళం