ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రక్త దానం చేయండి... మా కుమారుడి ప్రాణాలు కాపాడండి' - విశాఖలో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారి వార్తలు

విశాఖ మన్యం మాలివససకు చెందిన ఓ చిన్నారి తలసేమియాతో బాధపడుతున్నాడు. అతడికి రక్తమార్పిడి అవసరం. కానీ లాక్​డౌన్ కారణంగా ఆ బాలుడికి బి పాజిటివ్ రక్తం దొరకటం లేదు. తమ కూమారుడి ప్రాణాలు కాపాడాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

A child is suffering from thalassemia at malivalasa village in visakhapatnam agency and they want to blood in corona lockdown
A child is suffering from thalassemia at malivalasa village in visakhapatnam agency and they want to blood in corona lockdown

By

Published : May 5, 2020, 5:42 PM IST

విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయతి మాలివలసకు చెందిన షణ్ముఖ కుమార్ అనే రెండేళ్ల చిన్నారి.. తలసేమియా వ్యాధి బారిన పడ్డాడు. ప్రతీ నెలా రక్తం మార్పిడి చేస్తేనే గానీ బాలుడి ఆరోగ్యం సక్రమంగా ఉండదు. కానీ.. లాక్​డౌన్ కారణంగా బి పాజిటివ్ రక్త నిల్వలు లేకపోవడంతో బాలుడికి రక్త మార్పిడి జరగలేదు.

ఈ నేపథ్యంలో కుమారుడి ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా రక్తం దొరకడం లేదని... పేద కుటుంబానికి చెందిన తాము.. కుమారుడిని ఏ విధంగా రక్షించుకోవాలో అర్ధం కావడంలేదని రోదిస్తున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి... తమ చిన్నారిని కాపాడాలని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details