విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇంటర్‌ఛేంజ్ వంతెన కూలిన ఘటనపై కేసు నమోదైంది. దిలీప్ బిల్డ్‌కాన్ యాజమాన్యం, సైట్ ఇన్‌ఛార్జి ఈశ్వరరావు, జనరల్ మేనేజర్ నాగేంద్రకుమార్‌పై అనకాపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు.
అనకాపల్లిలో వంతెన కూలిన ఘటనపై కేసు నమోదు - అనకాపల్లి
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇంటర్‌ఛేంజ్ వంతెన కూలిన ఘటనపై కేసు నమోదైంది. దిలీప్ బిల్డ్‌కాన్ యాజమాన్యం, సైట్ ఇన్‌ఛార్జి, జనరల్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు.
అనకాపల్లిలో వంతెన కూలిన ఘటనపై కేసు నమోదు
నిన్న కారు మీద వంతెన గిడ్డర్లు పడి.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. నిర్లక్ష్యమో..సాంకేతిక లోపమో తెలియదు కాని.. నిండుప్రాణాలు బలయ్యాయి.
ఇదీ చూడండి.ఆ క్షణం మృత్యువుదే!!