జాతీయస్థాయి ఆన్లైన్ యోగా పోటీల్లో ద్వితీయస్థానం సాధించిన బాలుడిని విశాఖ జిల్లా చోడవరంలో పలువురు సత్కరించారు. విశ్వభారతి యోగా ట్రస్టు అధ్వర్యంలో జాతీయస్థాయి అన్లైన్ యోగా పోటీలు జరిగాయి. చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం నుంచి 11ఏళ్ల గొంతిన లయవర్ధన్తోపాటు పలువురు వేసిన ఆసనాలను వాట్సాప్ ద్వారా ఈ పోటీలకు పంపారు.
ఆన్లైన్ యోగాపోటీల్లో గెలుపొందిన బాలుడికి సత్కారం - విశ్వభారతి యోగా ట్రస్టు
జాతీయస్థాయి ఆన్లైన్ యోగా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన బాలుడిని విశాఖ జిల్లా చోడవరంలో పలువురు సత్కరించారు. విశ్వభారతి యోగా ట్రస్టు అధ్వర్యంలో జాతీయ స్థాయి అన్లైన్ యోగా పోటీలు జరుగ్గా... జిల్లాలోని పతంజలి యోగా శిక్షణ కేంద్రానికి చెందిన ఈ బుడతడు ఆసనాలను వేసి అవార్డును సంపాదించాడు.
![ఆన్లైన్ యోగాపోటీల్లో గెలుపొందిన బాలుడికి సత్కారం a boy honoured due to achieved second place in national level online yoga competition](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7746265-863-7746265-1592979870518.jpg)
జాతీయస్థాయి ఆన్లైన్ యోగాపోటీలలో గెలుపొందిన బాలుడికి సత్కారం
లయవర్ధన్ వేసిన ఆసనాలకు ద్వితీయ స్థానం వచ్చిందని పతంజలి యోగా శిక్షణ కేంద్రం నిర్వహకులు పుల్లేటి సతీష్ తెలిపారు. ఉషోదయ విద్యా సంస్థల ప్రాంగణంలో గోవాడ చక్కెర కర్మాగారం పరిపాలనాధికారి పప్పల వెంకటరమణ, చిన్నపిల్లల వైద్యులు బంగారు కృష్ణ చిన్నోడిని సన్మానించారు. శాలువా కప్పి, జ్ఞాపికలను బహూకరించారు.
ఇదీ చూడండి.పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత: గుంటూరు జిల్లాలో తెదేపా నేతపై దాడి