- సీఎం మారడం వల్లే రైతులు, పేదల తలరాతలు మారుతున్నాయి: సీఎం జగన్
గత ప్రభుత్వం మనకంటే ఎక్కువ అప్పులు చేసినా.. ఇప్పటిలా ఎందుకు సంక్షేమ పథకాలు అందించలేకపోయిందని.. సీఎం జగన్ ప్రశ్నించారు. తన సొంత నియోజక వర్గం పులివెందులలో.. ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు.
- వాలంటీర్లు రైతులపై పెత్తనం చేస్తారా?: చంద్రబాబు
టీడీపీ హయాంలో రైతులకు 2014-2019 వరకు స్వర్ణయుగమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఇదేం ఖర్మ.. రైతులకు సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతుల పంటను మొబైల్ ద్వారా నేరుగా అమ్ముకోవడానికి అవకాశమిచ్చామన్నారు. రైతు పండించే పంట నేరుగా వినియోగదారుడికి చేరేలా చేశామని తెలిపారు.
- సినీ, రాజకీయ రంగంలో ఎన్టీఆర్‌కు ఎవ్వరూ సాటిలేరు: వెంకయ్యనాయుడు
అటు సినీరంగంలో ఇటు రాజకీయరంగంలో ఎన్టీఆర్‌కు ఎవ్వరూ సాటిలేరని వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ నాయకుడైనా దృఢమైన జాతీయవాది అని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నటులు మురళీమోహన్, సీనియర్ నటి జయచిత్రకు ఎన్టీఆర్ అవార్డు అందజేశారు.
- తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లు.. కొద్ది నిమిషాల్లోనే
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేసింది. 10 రోజులకు సంబంధించిన టికెట్లు.. విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే అయిపోయాయి.
- రహదారి లేక అధికార పార్టీ నేతకూ తప్పని తిప్పలు
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసంగి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం కోసం స్థానిక ఎమ్మెల్యే ధర్మ శ్రీగుర్రం పై ప్రయాణించారు. నేటికి ఆ గ్రామానికి రోడ్డు లేకపోవటంతో గ్రామస్థులు మౌలిక సదుపాయాలకు దూరమైపోయారు. ఎమ్మెల్యే ధర్మ శ్రీ కొంత దూరం గుర్రం పై మరికొంత దూరం ద్విచక్రవాహనంపై ప్రయాణించి గ్రామానికి వెళ్లారు
- వేటగాళ్లకు సింహస్వప్నం.. పులుల్ని, చిరుతలను సంరక్షిస్తున్న శునకం!
శత్రువుల బారి నుంచి రాజ్యంలోని కాపాడుకునే బాధ్యత రాజుకు ఉంటుంది. అయితే తన భూభాగంలోకి శత్రువులను చొరబడకుండా 'రాణి' కాపాడుతోంది. ఉత్తరాఖండ్ రాజాజీ టైగర్ రిజర్వ్‌లోకి అక్రమంగా చొరబడే దుండగులను పోలీసులకు పట్టిస్తోంది ఈ రాణి అనే శునకం. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..
- దిల్లీలో జోరుగా భారత్ జోడో యాత్ర రాహుల్‌తో కలిసి కమల్ నడక
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర శనివారం దేశ రాజధాని దిల్లీలోకి ప్రవేశించింది. ఈ యాత్రలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి యాత్రలో నడిచారు.
- ఉత్తరాఖండ్‌లో గడ్డకట్టిన జలపాతాలు మంచుతో అమెరికా గజగజ చీకట్లో 15లక్షల ఇళ్లు
అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. చలుగాలులకు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఎంతగా అంటే మరిగే నీరు వెంటనే గడ్డకట్టిపోతోందంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు, ఉత్తర భారతదేశంలో జలపాతాలు, నీటి వనరులు గడ్డకట్టేస్తున్నాయి.
- IND Vs BAN: మూడో రోజు ఆట పూర్తి.. టీమ్‌ఇండియా 4 వికెట్లు డౌన్
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. తొలుత ఓవర్‌నైట్ స్కోరు 7/0తో ఆట ప్రారంభించిన బంగ్లా 231 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 145 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది.
- 'ఆ విషయాన్ని మార్చాలనుకుంటున్నా.. నేను నమ్మే సిద్ధాంతం అదే
'ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో మెగాస్టార్ చిరంజీవి సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుల విషయంలో సాధారణంగా ఉండే ఓ టాక్‌ను తిరగరాయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..
top news
Last Updated : Dec 24, 2022, 9:05 PM IST