- ఎన్నో విశిష్టతలకు ఆంధ్రప్రదేశ్ నెలవు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ది అసాధారణ భాగస్వామ్యం కావాలని... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఎన్నో విశిష్టతలకు ఆంధ్రప్రదేశ్ నెలవని అన్నారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన ద్రౌపదీ ముర్ముకు ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ప్రభుత్వం తరఫున పౌర సన్మానం నిర్వహించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రేపు దిల్లీకి చంద్రబాబు.. ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు రేపు దిల్లీకి వెళ్లనున్నారు. భారత్‌లో నిర్వహించే జీ -20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో చర్చించేందుకు ప్రధాని.. రాష్ట్రపతి భవన్లో రేపు సాయంత్రం 5 గంటలకు సదస్సు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఆకట్టుకున్న నౌకాదళ విన్యాసాలు
నేవీడే సందర్బంగా విశాఖ ఆర్‌కే బీచ్‌లో నౌకాదళం నిర్వహించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. క్లిష్ట పరిస్థితుల్లో శత్రుమూకలపై దాడి చేసే విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హైస్పీడ్ బోట్లతో సముద్రం నుంచి వేగంగా ఒడ్డుకు రావడం, యుద్ధనౌకలో విన్యాసాలు, గగనతలంలో చేతక్ హెలికాప్టర్ల సాహసకృత్యాలు, మిగ్-29 యుద్ధవిమానాల ప్రదర్శన సహా యుద్ధనౌకలు, జలాంతర్గాముల నుంచి ఒకేసారి రాకెట్ ఫైరింగ్ చేయడం మెప్పించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జగన్‌ని జనం ఎందుకు నమ్మాలి: నారా లోకేశ్
ప్రతీ ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ ఏళ్ళు గడుస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండరూ ఇవ్వలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. పదేళ్లలోపు సర్వీసు వున్న వారందరినీ ఇంటికి సాగనంపుతున్న జగన్‌ని జనం ఎందుకు నమ్మాలని నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 93 స్థానాలు.. 833 మంది అభ్యర్థులు.. గుజరాత్ రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన గుజరాత్ ఎన్నికల రెండోవిడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ విడతలో గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్, పటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్, ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ తదితరులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బస్‌స్టాప్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం
మధ్యప్రదేశ్.. రత్లాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్‌స్టాప్‌లో ఉన్న ప్రయాణికులపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. మరో పదిమంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇరాన్ 'హిజాబ్' వివాదంలో దిగొచ్చిన ప్రభుత్వం.. నైతిక పోలీసు వ్యవస్థ రద్దు
హిజాబ్‌కు వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగిన వేళ ఇరాన్ సర్కారు ఎట్టకేలకు దిగివచ్చింది. నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హిజాబ్ చట్టాల అమలు కోసం 2005లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హిజాబ్ సరిగ్గా ధరించలేదని మాసా అమీని అనే యువతిపై నైతిక పోలీసులు దాడి చేయగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పిల్లల భవితకు భరోసా.. ఉన్నత విద్య కోసం ప్లాన్ చేయండిలా..
పిల్లలు ఉన్నత చదువులు చదవాలి అనే కోరిక ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉంటుంది. అందుకే, వీలైనంత మొత్తాన్ని పెట్టుబడులకు కేటాయిస్తూ.. భవిష్యత్ ఖర్చులకు సిద్ధంగా ఉంటారు. విద్యా ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో దీనికి మించి రాబడి ఆర్జించే మార్గాల్లో మదుపు చేయాలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీమ్ఇండియా బౌలర్ల శ్రమ వృథా.. ఉత్కంఠ పోరులో బంగ్లా విజయం
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. అద్భుత ప్రదర్శన చేసిన భారత బౌలర్లు శ్రమ వృథా అయ్యింది. ఇక అద్భుతంగా ఆడిన.. బంగ్లా టెయిల్ ఎండర్లు.. జట్టును విజయ తీరాలకు నడిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కేజీయఫ్' నిర్మాతలతో కీర్తి సురేశ్ భారీ ప్రాజెక్టు.. కాంబో అదిరిందిగా!
టాలీవుడ్ అందాల భామ కీర్తి సురేశ్ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించనున్న తొలి తమిళ చిత్రంలో నటించనున్నారు. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS