ఏటీఎంలో చోరీ.. రూ.9.5 లక్షలు అపహరణ
విశాఖలోని పాత డెయిరీ ఫారం వద్ద ఏటీఎంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎటీఎంలో చోరీ
విశాఖ జిల్లాలోని విశాలాక్షి నగర్లో ఉన్న పాత డెయిరీ ఫారం వద్ద ఏటీఎంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ ఉపయోగించి దుండగులు రూ.9.5 లక్షల నగదును అపహరించారు. దీన్ని గమనించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచార అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు జాగిలాలతో దర్యాప్తు మొదలుపెట్టారు.