ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జైలు నుంచి 74 మంది ఖైదీలు విడుదల - 74 prisoners released from Visakha Prison news

కరోనా వైరస్ ప్రభావం తీవ్రమవుతున్న తరుణంలో విశాఖ కేంద్ర కారాగారంలో 74 మంది ఖైదీలను విడుదల చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

74Prisoners released from Visakha Prison
విశాఖ జైలు నుంచి 74 మంది ఖైదీల విడుదల

By

Published : Apr 1, 2020, 8:44 AM IST

విశాఖ జైలు నుంచి 74 మంది ఖైదీల విడుదల

విశాఖ జిల్లా కేంద్ర కారాగారం నుంచి కొవిడ్-19 కారణంతో సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం 74 మంది ముద్దాయిలను మధ్యంతర బెయిల్​పై అధికారులు విడుదల చేశారు. వీరిలో 53 మంది రిమాండ్ ముద్దాయిలు, 21 మంది శిక్ష కాలం ముద్దాయిలు ఉన్నారు. వీరిలో ఏడుగురు మహిళా ముద్దాయిలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఖైదీలందరికీ మాస్కులిచ్చామని సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ తెలిపారు. బంధువులు వస్తే వారి స్వీయ పర్యవేక్షణలో ఇళ్లకు పంపుతున్నారు. ఇళ్లకు వెళ్లినా అక్కడ స్వీయ నిర్బంధంలో ఉండేలా సూచనలు చేశారు. ముద్దాయిలు నెల రోజుల తరువాత తిరిగి జైల్ అధికారులకు రిపోర్ట్ చేయాలని విశాఖ కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ తెలిపారు.

ఇదీ చదవండి:

ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details