విశాఖ జిల్లా అనకాపల్లిలో గత 24 గంటల వ్యవధిలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 132కి చేరింది. శనివారం కరోనా సోకిన వారిలో గవరపాలెంలోని వీజే నాయుడు వీధికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి... చినరాజుపేటకు చెందిన 22 ఏళ్ల యువతి ఉన్నారు. దేవుడుతోట ప్రాంతానికి చెందిన 69 ఏళ్ల వృద్ధుడు, నర్సింగరావుపేట చెందిన 19 ఏళ్ల యువకుడు, చినరామస్వామి కోవెల ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. గవరపాలెం సతకంపట్టు వద్ద నివసిస్తున్న 35 ఏళ్ల వ్యక్తి, పీలానాయుడు వీధిలో ఉంటున్న 44 ఏళ్ల వ్యక్తి కూడా కొవిడ్ బారిన పడ్డారు. జీవీఎంసీ జోనల్ అధికారులు కంటైన్మెంట్ జోన్లలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు.
24 గంటల్లో అనకాపల్లిలో ఏడు పాజిటివ్ కేసులు - విశాఖ జిల్లా తాజా కరోనా వార్తలు
అనకాపల్లిలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శనివారం మరో ఏడుగురికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో పట్టణంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 132కి చేరింది.
![24 గంటల్లో అనకాపల్లిలో ఏడు పాజిటివ్ కేసులు 7 corona cases found in anakapalle in past 24 hours and officers gets alert](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7991459-60-7991459-1594516305791.jpg)
7 more cases found in anakapalle