ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో రూ.5 కోట్లు విలువైన గంజాయి పట్టివేత - ఆరు టన్నుల గంజాయి పట్టివేత

విశాఖ ఏజెన్సీ ప్రాంతం బిర్రిగుడ గ్రామంలోని ఓ ఇంట్లో ఆరు టన్నుల గంజాయిని ఎక్సైజ్‌ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు విలువ దాదాపు 5 కోట్లు ఉంటుందని అంచనా.

ganjai

By

Published : Sep 24, 2019, 2:28 PM IST

Updated : Sep 24, 2019, 6:33 PM IST

పట్టుబడ్డ గంజాయి

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ బిర్రిగుడ గ్రామంలో ఎక్సైజ్ అధికారులు రికార్డు స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు ఇళ్లపై దాడి చేసి.. దాదాపు 6 వేల కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ సరుకు విలువ సుమారు 5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒడిశా సరిహద్దుల్లో పండించిన గంజాయిని ఇక్కడ నిల్వ ఉంచినట్లు గుర్తించారు. పట్టుకున్న సరుకును పాడేరు ఎక్సైజ్ స్టేషన్​కు తరలించి.. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.

Last Updated : Sep 24, 2019, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details