విశాఖ జిల్లా కె. కోటపాడు మండలం బత్తివానిపాలెం వద్ద ఓ వాహనంలో తరలిస్తున్న 580 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అదుపులో తీసుకోగా.. మరో ముగ్గురు వ్యక్తులు పరారైనట్లు ఎస్సై నారాయణరావు చెప్పారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.11.60 లక్షలు ఉంటుందన్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.
కె.కోటపాడులో 580 కిలోల గంజాయి పట్టివేత - విశాఖపట్నం ముఖ్యాంశాలు
విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం బత్తివానిపాలె వద్ద పోలీసులు భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. ఒకరిని అదుపులో తీసుకోగా... ముగ్గురు పరారయ్యారు.
గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఇదీ చదవండి: కోనాం సర్పంచి పదవికి అత్తా కోడలు పోటీ..!