Offers of employment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) క్యాంపస్ ప్రాంగణ నియామకాల్లో రికార్డు సృష్టించింది. తొలిదశలో క్యాంపస్ చరిత్రలోనే అత్యధికంగా 474 మంది విద్యార్థులకు 508 ఆఫర్లు వచ్చాయి. ఇందులో 54 అంతర్జాతీయ, 99 ప్రీ ప్లేస్‌మెంట్ అవకాశాలు ఉండటం విశేషం. మొత్తం 700కు పైగా విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఇంటర్వ్యూల ప్రక్రియ అంతా ఆన్‌లైన్ ద్వారా జరిగింది. ఈ ఆఫర్లలో అత్యధిక వార్షిక వేతనం సుమారు రూ.64 లక్షలుగా ఉంది.
ఐఐటీ హైదరాబాద్ రికార్డు.. 474 మందికి 508 ఉద్యోగ ఆఫర్లు - ఎపీ తాజా వార్తలు
Offers of employment : ఐఐటీ హైదరాబాద్ రికార్డు సృష్టించింది. క్యాంపస్ ప్రాంగణ నియామకాల్లో తొలిదశలో 474 మంది విద్యార్థులకు 508 ఆఫర్లు వచ్చాయి. ఈ ఆఫర్లలో అత్యధిక వార్షిక వేతనం సుమారు రూ.64 లక్షలుగా ఉంది.
క్యాంపస్ ప్రాంగణ నియామకాల్లో
విద్యార్థులకు వచ్చిన ఈ ఉద్యోగ ఆఫర్లపై ఐఐటీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ స్థాయిలో ఆఫర్లు రావడం గర్వకారణమని పేర్కొన్నాయి. డిసెంబరు 1 నుంచి 7 వరకు తొలి దశ ప్రాంగణ నియామకాలు జరగాయని.. రెండో దశ నియామకాలు జనవరిలో ఉంటాయని తెలిపాయి. రెండో దశలోనూ ఇదే స్థాయిలో ఆఫర్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాయి.
ఇవీ చదవండి :