విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని నిమ్మచెట్టు గ్రామ సమీపంలో ఉన్న రహదారిపై వంతెన నిర్మాణం జరగకపోవటం కారణంగా 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయని స్థానికులు తెలిపారు. 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటకీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఏ మాత్రం స్పందించటం లేదని వాపోయారు.
వంతెన లేక ఇబ్బందులు పడుతున్న 50 గ్రామాల ప్రజలు - tribal news in visakha
విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని నిమ్మచెట్టు గ్రామంలో వంతెన నిర్మించాలని స్థానికులు కోరారు. 50 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
50 villagers facing problems due to no bridge in viskaha
వర్షాకాలం ప్రారంభం అయినప్పటి నుంచి తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని చెబుతున్నారు. నిరంతరం ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగించాల్సిన పరిస్థతి ఏర్పడుతుందని వారు వాపోయారు.
ఇదీ చూడండి