విశాఖ జిల్లా మాడుగుల మండలం సురవరం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడింది. మన్యం నుంచి రోడ్డుమార్గంలో ఆటోలో నలుగురు వ్యక్తులు గంజాయి తరలిస్తున్నారు. తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి పారిపోయారు. అనుమానం వచ్చి పోలీసులు వెంబడించి ముగ్గురిని పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆటోతో సహా రూ.లక్ష విలువైన 41 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తుల నుంచి 3సెల్ ఫోన్లు, రూ.2వేలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని... ఆటోను సీజ్ చేసినట్లు మాడుగుల ఎస్సై తారకేశ్వరరావు చెప్పారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
41 కేజీల గంజాయి స్వాధీనం... ముగ్గురు అరెస్టు - గంజాయి
విశాఖ జిల్లా మాడుగులలో ఆటోలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నారు.
![41 కేజీల గంజాయి స్వాధీనం... ముగ్గురు అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3953351-297-3953351-1564139032390.jpg)
41 కేజీల గంజాయి స్వాధీనం... ముగ్గురు అరెస్టు
41 కేజీల గంజాయి స్వాధీనం... ముగ్గురు అరెస్టు
ఇదీ చదవండీ...