ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాడుగులలో రూ.40 లక్షల విలువైన నాటుసారా ధ్వంసం - పాడేరు

విశాఖ జిల్లా మాడుగుల శివారు అటవీ ప్రాంతంలో గత మూడేళ్లలో 18,554 లీటర్ల నాటుసారా పట్టుబడిందని జిల్లా సెబ్​ రూరల్ అదనపు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ తెలిపారు. పట్టుబడిన సారా విలువ సుమారు రూ.40.16 లక్షలు ఉంటుందని చెప్పారు. అనకాపల్లి, పాడేరు సబ్ డివిజన్ పరిధిలోనే సారా అంతా పట్టుబడిందని వెల్లడించారు.

NAATU SARA DESTROYED BY VIZAG POLICE
మాడుగులలో రూ.40 లక్షల నాటుసారా ధ్వంసం

By

Published : Jun 29, 2021, 12:33 PM IST

గత మూడేళ్లలో రూ.40.16 లక్షల విలువ గల నాటుసారా పట్టుబడిందని విశాఖ జిల్లా సెబీ(ఎస్ఈబి) రూరల్ అదనపు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ తెలిపారు. అనకాపల్లి సబ్ డివిజన్​లోని 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో మరియు పాడేరు సబ్ డివిజన్ల్​లోని​ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 18,554 లీటర్ల నాటుసారా పట్టుబడిందని తెలిపారు. మాడుగుల శివారు ఉబ్బలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో సెబ్​ రూరల్ అదనపు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, విశాఖ డీటీసీ డిఎస్పీ ప్రవీణ్ కుమార్, అనకాపల్లి డీఎస్పీ శ్రావణి సమక్షంలో పోలీసులు ఈ నాటుసారాను ధ్వంసం చేశారు. 2,715 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details